ఎమ్మెల్యే చల్లాను కలిసిన మోడల్‌స్కూల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌


Mon,December 2, 2019 02:35 AM

సంగెం, డిసెంబర్‌ 01 : మండలంలోని గవిచర్ల మోడల్‌స్కూల్‌లో పాఠశాల కమిటీ చైర్మన్‌,వైస్‌ చైర్మన్లుగా ఎన్నికైన వారు ఆదివారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం జరిగిన గవిచర్ల మోడల్‌స్కూల్‌లో ఎస్‌ఎంసీ ఎన్నికల్లో చైర్మన్‌ గా మందపురి బలరా మ్‌, వైస్‌చైర్మన్‌గా తాటికాయల రజిత, గవిచర్ల జెడ్పీఉన్నత పాఠశాల చై ర్మన్‌ నాగపురి శ్రీనివా స్‌, ప్రాథమిక పాఠశాల చైర్మన్‌ బల్సుకూరి రాజు ఎమ్మెల్యే ధర్మారెడ్డి నివాసంలో కలిసి పుష్పగు చ్ఛం అందజేశారు.ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే ధర్మారెడ్డి అభినందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ దొనికెల శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ చెన్నూరి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...