వినియోగదారుల కోసం ప్రత్యేక బృందాలు


Sun,December 1, 2019 04:28 AM

-ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్ రావు

వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ : విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్ రావు వెల్లడించారు. శనివారం నక్కలగ్టుటలోని విద్యుత్ భవన్‌లో వరంగల్ నగర అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. ప్రత్యేక బృందాలతో వినియోగదారుల అభివూపాయాలను సేకరించి విద్యుత్ సరఫరాలోపాలను గుర్తించాలన్నారు.

నిరంతర విద్యుత్ సరఫరాలో నాణ్యత కోసం స్కాడా టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను పూర్తిగా నిరోధించాలని ఆదేశించారు. ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలను 100 శాతం నిరోధించేందుకు సిబ్బంది కృషి చేయాలని చెప్పారు. అదేవిధంగా 100 శాతం బిల్లింగ్ చేయాలని, అందులో 1/3 బిల్లింగ్ డిపార్ట్‌మెంటు సిబ్బంది చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్‌ఈ రాజు చౌహాన్, జీఎంలు వెంకటరమణ, శ్రీనివాస్,డిఈ హుస్సేన్ నాయక్, అమర్నాథ్, సుబ్రహ్మణ్యేశర రావు, అనిల్ రెడ్డిలు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...