ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలి


Sun,December 1, 2019 04:25 AM

-ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్
-ఎల్కతుర్తిలో ఫిట్ ఇండియా ఆరోగ్య జాతర
ఎల్కతుర్తి: నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాల్సిన అవసరం ఉందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. శనివారం ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలో ఫిట్ ఇండియా ఆరోగ్య జాతర కార్యక్షికమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల నుంచి ఉదయమే యువకులు వాకింగ్, రన్నింగ్ ద్వారా మండల కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రైనర్లు యోగా, వ్యాయామంపై శిక్షణ ఇచ్చారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, జెడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. సీజనల్‌గా వచ్చే పండ్లు తీసుకోవాలని చెప్పారు. గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్ఫూర్తితో ఇలాంటి కార్యక్షికమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. యువత ఉత్సాహంగా ఉండాలంటే, ఫిట్నెస్‌ను కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

వ్యాయామం చేయాలి..
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయాలని జెడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్ అన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలుగుతామని, ఆ దిశగా ప్రజలందరూ ఆలోచన చేయాలని తెలిపారు. ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్షికమాలు చేయడం అభినందనీయమని చెప్పారు. కార్యక్షికమంలో సీఐలు జాన్ నర్సింహులు, డేవిడ్‌రాజు, సదన్‌కుమార్, ఎంపీపీ మేకల స్వప్న, తహసీల్దార్ గుజ్జుల రవీందర్‌డ్డి, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, సర్పంచ్ కొమ్మిడి నిరంజన్‌డ్డి, ఎంపీటీసీ కడారి రాజు, శ్రీపతి రవీందర్‌గౌడ్, తంగెడ మహేందర్, ఫిట్ ఇండియా నాయకులు సమ్మయ్య, అల్లకొండ రాజు, అంబాల పవన్‌కుమార్, ప్రశాంత్, దాట్ల నరేశ్, నార్లగిరి శ్రీనివాస్, లోకేశ్ ఆయా గ్రామాల ప్రజావూపతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...