కార్మికోత్సాహం..


Sat,November 30, 2019 03:17 AM

-ఉదయమే డిపోలకు తరలివచ్చిన ఆర్టీసీ కార్మికులు
-ఫస్ట్ అవర్ డ్యూటీతో సేవలు ప్రారంభం
-రిపోర్టు చేసిన 3995 మంది సిబ్బంది
సుబేదారి, నవంబర్ 29: ఆర్టీసీ కార్మికులు సంబురంగా విధుల్లో చేరారు. సమ్మె కారణంగా డ్యూటీకి దూరంగా ఉన్న కార్మికులు 54 రోజుల తర్వాత డిపోలకు వచ్చారు. డ్యూటీ రిజిస్టర్‌లో సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు. కార్మికులు అ క్టోబర్ 5 నుంచి నవంబర్ 28 వరకు 54 రోజలపాటు సమ్మెలో ఉన్నారు. సమ్మె అనేక మలుపులు తిరగడం.. చివరికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి, డ్యూటీలో చేరండని పిలునిచ్చిన వి షయం తెలిసిందే. కాగా సీఎం ప్రకటనతో శుక్రవారం ఉదయం ఫస్ట్ అవర్ డ్యూటీలో చేరడానికి వరంగల్ రీజియన్‌లోని వరంగల్ 1, 2, హన్మకొండ, భూ పాలపల్లి, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, జనగామ డిపోలకు చెందిన డ్రైవ ర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లు తరలివచ్చారు. తోటి ఉద్యోగులను పలకరించి సంతోషంగా బాధ్యతలు తీసుకున్నా రు. సీఎం కేసీఆర్ తమకు అండగా నిలిచారని, కార్మికుల కష్టసుఖాలు తెలిసినోడని పలువురు చర్చించుకోవడం కనిపించింది. ఆర్టీసీకి వంద కోట్ల ని ధులు కేటాయించడం అభినందనీయమని, నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించడానికి కిలోమీటర్‌కు రూ.20 పైసలు చొప్పున చార్జీలు పెంచడం సరియైనదని కార్మికులు సీఎం నిర్ణయంతో ఏకీభవించారు.

వరంగల్ రీజియన్‌లో నిన్న.. నేడు
ఆర్టీసీ కార్మికులు 54 రోజులు సమ్మె చేసినా ఫలితంలేకుండా పోయింది. లేబర్ కోర్టులో సమస్యలను తేల్చుకోవాలని హైకో ర్టు సూచించడంతో వారం రోజుల క్రితం సమ్మెను విరమిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. జేఏసీ ప్రకటనతో డ్యూటీ లోకి తీసుకోవాలని కార్మికులు డిపోల చుట్టూ తిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆర్టీసీ యాజమాన్యం నుంచి కానీ ఆదేశాలు లేకపోవడంతో డిపో అధికారులు కార్మికు లను విధుల్లోకి తీసుకోలేదు. అంతేగాక డిపోలోకి వెళ్లకుండా కార్మికులను అడ్డుకుని పోలీసులు అరెస్టు చేశారు. వారం రోజుల తర్వాత సీన్ మారిం ది. సీఎం కేసీఆర్ డ్యూటీలో చే రండని పిలునివ్వడంతో కార్మికుల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసిం ది. డిపో వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు, కృతజ్ఞత కార్యక్షికమా లు చేపట్టారు. వారం కింద డ్యూటీలోకి తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ప్రా థేయపడిన కార్మికులు.. చివరికి సీఎం కేసీఆర్ ప్రకటనతో తిరిగి విధుల్లో చేరడానికి డిపోలకు తరలివచ్చారు.

రిపోర్టు చేసిన కార్మికులు 3995 మంది
వరంగల్ రీజియన్‌లోని తొమ్మిది డిపోల్లో మొ త్తం 4 వేల 98 మంది ఉద్యోగులు పని చేస్తున్నా రు. డిపోలవారిగా వరంగల్ హన్మకొండ డిపోలో 588 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 583 మంది డ్యూటీ రిపోర్టు చేశారు. ఐదుగురు మాత్రమే రిపోర్టు చేయలేదు. జనగామ డిపోలో 537 ఉద్యోగులకు 530 మంది రిపోర్టు చేశారు. మహబుబాబాద్ డిపోలో 304 కార్మికులకుగాను 300 మంది, నర్సంపేటలో 437కు గాను 432 మంది, పరకాలలో 406కుగాను 401 మంది, తొర్రూ రు డిపోలో 362 కిగాను 359 మంది, వరంగల్-1 డిపోలో 548 మందికిగాను 542 మంది రిపోర్టు చేశారు. వరంగల్ 2 డిపో 478 మంది కార్మికులకుగాను 473 మంది, భూపాలపల్లిలో 378 కార్మికులకుగాను 375 మంది డ్యూటీ రిపోర్టు చేసినట్లు ఆర్‌ఎం ఏ శ్రీధర్ తెలిపారు. రీజియన్‌లో 43 మంది వివిధ కారణాల వల్ల రిపోర్టు చేయలేదని ఆయన వెల్లడించారు. కార్మికులు డ్యూటీకి వచ్చిన మొదటి రోజు వరంగల్ రీజియన్ లోని తొమ్మిది డిపోల నుంచి 861 బస్సులు నడిపినట్లు రీజినల్ మే నేజర్ శ్రీధర్ తెలిపారు. శుక్ర వారం తెల్లవారు జామున ఫస్ట్ అవర్ డ్యూటీ నుంచి సా యంత్రం ఆరు గంటలకు వరకు మొత్తం ఒక లక్షా, 89 వేల 12 మందిని గమ్య స్థానాలకు చేర వే సినట్లు ఆర్‌ఎం తెలిపారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...