విద్యార్థుల్లో మానవీయ విలువలను పెంపొందించాలి


Tue,November 19, 2019 03:28 AM

-సీడబ్ల్యూసీ చైర్మన్‌ పరశురాములు
భీమారం, నవంబర్‌18: విద్యార్థుల్లో మానవీయ విలువలను పెంపొందించాలని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ మండల పరశురాములు ఉపాధ్యాయులకు సూచించారు. గ్రేటర్‌ పరిధి భీమారం కస్తూర్బా బాలిక విద్యాలయంలో సోమవారం చైల్డ్‌లైన్‌-1098పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ బాలబాలికల్లో క్రమశిక్షణ, దేశభక్తి భావనను పెంపొందించాలని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ బాలబాలికల విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తోందన్నారు. సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులను ప్రయోజకులను చేస్తోందన్నారు. బాలికల తల్లిదండ్రులు బాల్య వివాహాల పేరుతో భావి జీవితాన్ని నాశనం చేయవద్దని ఆయన సూచించారు. బాలల పరిరక్ష ణ కోసం విద్యాశాఖ, కార్మికశాఖ, పోలీస్‌ శాఖ, చైల్డ్‌లైన్‌ సంస్థలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో చైల్డ్‌లైన్‌ నోడల్‌ కో-ఆర్డినేటర్‌ ఇక్బాల్‌ పాషా, డీసీఎం ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌, భీమారం కాస్తూర్బా విద్యాలయం స్పెషల్‌ ఆఫీసర్‌ స్వప్న, ఉపాధ్యాయులు సంధ్యారాణి, రాజేశ్వరి, రమేశ్‌, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...