విచారణ ఖైదీలు ఉచిత న్యాయసేవలను వినియోగించుకోవాలి


Tue,November 19, 2019 03:26 AM

-జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మహేశ్‌నాథ్‌
వరంగల్‌ క్రైం, నవంబర్‌18 : విచారణ ఖైదీలు ఉచిత న్యాయసేవా సంస్థ సేవలను వినియోగించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జీవీ మహేశ్‌నాథ్‌ పేర్కొన్నారు. సోమవారం వరంగల్‌ సెంట్రల్‌ జైలులో న్యాయ విజ్ఞాన సద స్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి మహేశ్‌నాథ్‌ మాట్లాడుతూ ప్లీ బాైర్గెనింగ్‌ ద్వారా బాధితులకు, సాక్ష్యులకు ఉపశమనం కలుగడమే కాకుండా కోరుఉ్ట సమయాన్ని ఆదా చేయవచ్చన్నారు. ప్లీ బాైర్గెనింగ్‌ అనేది ఏడేళ్ల కన్నా ఎక్కువ జైలు శిక్ష విధించిన నేరాలకు మాత్రమే వర్తిస్తుందని అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ సాయంతో ఉచితంగా న్యాయవాదిని నియమించుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో జైలు పర్యవేక్షణాధికారి మురళిబాబు, ఉప పర్యవేక్షణాధికారి భరత్‌, కాళిదాసు, అమరావతి, జైలర్లు సక్రునాయక్‌, పీ శ్రీనివాస్‌, ప్రేమ్‌కుమార్‌, డిప్యూటీ జైలర్లు శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్‌, రమేశ్‌ పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...