కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి


Mon,November 18, 2019 05:08 AM

ఎల్కతుర్తి : రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని జెడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్ చెప్పారు. మండలంలోని కేశవాపూర్‌లో ఎల్కతుర్తి విశాల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ రకానికి రూ.1835, కామన్ రకానికి రూ. 1815గా ధర నిర్ణయించారన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల స్వప్న, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, సర్పంచ్ ఈర కృష్ణవేణి, సొసైటీ సీఈవో తిరుపతి, నోడల్ అధికారి మనోహర్‌రావు, రాజయ్య, మహేందర్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల
మద్దతు ధర : జెడ్పీటీసీ
హసన్‌పర్తి : ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రా ల ద్వారానే రైతుకు మద్ద తు ధర లభిస్తుందని జెడ్పీటీసీ రేణికుంట్ల సునీత అన్నారు. మండలంలోని అనంతసాగర్, ఎల్లాపూర్ గ్రామాలలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యం లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. రైతులు పండించిన పంటలకు దళారీలకు అమ్మి నష్టపోకుండా ప్రతి గ్రామంలో రైతులకు అందుబాటులో మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బండ అమితాజీవన్‌రెడ్డి, ఏపీఎం రాజు, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ అం చూరి విజయ్‌కుమార్, జిల్లా సభ్యుడు విక్టర్‌బాబు, మా ర్కెట్ కమిటీ డైరెక్టర్ చకిలం రాజేశ్వర్‌రావు, మాజీ చైర్మన్ రజనీకుమార్, టీఆర్‌ఎస్ నాయకులు బండ జీవన్‌రెడ్డి, రాజేందర్, రాజు, ప్రసాద్, నాగరాజు పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...