ఘనంగా కెప్టెన్ జన్మదిన వేడుకలు


Mon,November 18, 2019 05:07 AM

-శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
అర్బన్ కలెక్టరేట్, నవంబర్ 17: రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు జ న్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పలువురు ప్రముఖులు శుభాకాంక్ష లు తెలిపారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు పంపారు. అలాగే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రి రాంవిలాస్‌పాశ్వాన్, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ తదితరులు ట్విట్టర్‌లో కెప్టెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్‌ఎస్ నాయకులు రాజ్యసభ సభ్యుడు లక్ష్మీకాంతారావుకు శుభాకాంక్షలు చెప్పారు. తండ్రి పుట్టిన రోజు సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపి, ఆశీస్సులు తీసుకున్నారు. తన పుట్టిన రోజును పురస్కరించుకొని కుటుంబసభ్యులతో కలిసి కెప్టెన్ కేక్ కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. వరంగల్, కరీంనగర్, సిద్దిపేట జిల్లాలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్, హుస్నాబాద్‌తోపాటు పలు మండల కేంద్రాలు, గ్రామాల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చే శారు. పలువురు టీఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్‌కు వెళ్లి కెప్టెన్‌ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేక్‌లు కట్ చేసి కెప్టెన్‌ను సన్మానించారు. జెడ్పీ చై ర్మన్లు, వైస్ చైక్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు కెప్టెన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...