సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం


Mon,November 18, 2019 05:07 AM

వరంగల్ చౌరస్తా, నవంబర్ 17: వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఆదివారం వరంగల్ చౌరస్తాలోని వైశ్య భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ నిజామాబాద్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, తెలంగాణ పోలీసు గృహనిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ అభ్యర్థన మేరకు తెలం గాణ ఆర్యవైశ్య మహాసభ కార్యాలయం, పేద ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడం, వైశ్య సామాజిక అవసరాలకై హైదరాబాద్‌లో ఐదెకరాల స్థలాన్ని కేటాయించడం ఆనందంగా ఉందని చెప్పారు. అగ్రవర్ణ కులంగా పేరుపొందిన ఆర్యవైశ్యుల్లో సైతం కటిక పేదరికం అనుభవిస్తున్న వారు ఉన్నారని, దాన్ని గుర్తించి ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తొనుపునూరి వీరన్న, దాచేపల్లి సీతారాం, తోట హరీష్, టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నీలా శ్రీధర్‌రావు, రాష్ట్ర వైశ్య మహాసభ లీగల్ సెల్ వైస్ చైర్మన్, వరంగల్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణమూర్తి, అయిత ప్రసాద్, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గార్లపాటి శ్రీనివాస్, వాసవీ క్లబ్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles