జంపన్న వాగులో ఇద్దరు గల్లంతు


Mon,November 18, 2019 05:07 AM

-మేడారం జాతరకు వచ్చి ఈత కొట్టేందుకు వాగులోకి దిగిన మంచిర్యాల జిల్లావాసులు
-స్థానిక జాలర్లతో గాలించినాదొరకని ఆచూకీ
తాడ్వాయి, నవంబర్ 17 : మండలంలోని మేడారంలో గల జంపన్నవాగులో పడి పుప్పిరెడ్డి రఘునాథ్(18) ఓరం ప్రశాంత్(28) అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని అరుణక్క నగర్‌కు చెందిన 9 మంది యువకులు సమ్మక్క-సారక్క దర్శనానికి మధ్యాహ్నం వచ్చారు. ఓరం ప్రశాంత్, పుప్పిరెడ్డి రుఘునాథ్, పుప్పిరెడ్డి రాజు, బాసాని అరవింద్, గువ్వ రమేశ్, గువ్వ సురేశ్, నైతం రవి, జడిచర్చల ప్రశాంత్, సముద్రాల మహేశ్‌లు సమ్మక్క సారమ్మను దర్శనం చేసుకున్నారు. అమ్మవార్ల దర్శనం అనంతరం ఊరట్టం లోలెవల్ కాజ్‌వే వద్ద విడిది చేశారు. మిత్రులందరూ వంటలు చేస్తుండగా రఘు, ప్రశాంత్ మాత్రం ఈత కొట్టేందుకు జంపన్న వాగులోకి దిగారు.
కాజ్‌వే వద్ద లోతు ఎక్కువగా ఉండటంతో ఈత కొట్టేందుకు దిగిన ఇద్దరు గల్లంతయ్యా రు. గమనించిన స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా వారి ఆచూకీ లభించలేదు. సమాచారం తెలుసుకున్న తాడ్వాయి ఎస్సై రవీందర్ వాగు వద్దకు వెళ్లి స్థానిక జాలర్లతో గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఓరం ప్రశాంత్‌కు మూడు నెలల క్రితమే సింగరేణిలో ఉద్యోగం వచ్చింది.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles