ఏసీబీ వలలో ఎస్టీవో


Sun,November 17, 2019 02:31 AM

-రూ.15 వేలు లంచంగా తీసుకుంటూ పట్టుబడిన వైనం
-ఇదే ఘటనలో చిక్కిన సీనియర్ అసిస్టెంట్

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, నవంబర్ 16 : రిటైర్డ్ ఉద్యోగి నుంచి ఎస్టీవో అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీలు ప్రతాప్, మధుసూధన్ కథనం ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో ఈవోపీఆర్డీగా విధులు నిర్వహించిన శ్రీరాములు ఇటీవల పదవీ విరమణ పొందారు. తనకు సంబంధించిన పెన్షన్, గ్రాట్యువిటీ, జీపీఎఫ్ రావల్సి ఉండగా ఎస్టీవో విక్రమ్‌కుమార్‌ను కార్యాలయంలో కలిసి తనకు రావాల్సిన మొత్తాన్ని తన వ్యక్తిగత ఖాతాలో వేయాలని కోరాడు. దీనికి తనకు రూ.15 వేలు ఇవ్వాలని కోరడంతో శ్రీరాములు ఏసీబీ అధికారులకు ఆశ్రయించాడు. దీంతో శనివారం మధ్యాహ్నం కార్యాలయంలో రూ.15 వేలను ఇచ్చేందుకు రావడంతో సీనియర్ అసిస్టెంట్ నజీరాకు ఇవ్వాలని సూచించడంతో శ్రీరాములు నజీరాకు ఇచ్చాడు. అప్పటికే మా టువేసి ఉన్న ఏసీబీ అధికారులు ఒక్కసారిగా మూకుమ్మడిగా కార్యాలయంపై దాడులు చేసి నజీరా నుంచి రూ.15వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి కేసు నమోదు చేసి ఈ ఏడాదిలో ఎంత మందికి సంబంధించిన పెన్షన్ ఫైల్‌లు ఫార్వర్డ్ అయ్యాయనే విషయాలపై సమగ్రంగా విచారణ చేపడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిం దుతులను రిమాండ్‌కు తరలించి సమగ్రంగా విచారణ చేయనున్నట్లు వివరించారు. అలాగే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగినట్లయితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ ప్రతాప్ తెలిపారు. ఈ దాడిలో సీఐలు క్రాంతి, సతీశ్, సిబ్బంది పాల్గొన్నారు.

లంచం ఇవ్వడం ఇష్టలేకనే ఏసీబీని ఆశ్రయించా ..
- శ్రీరాములు , ఫిర్యాదుదారుడు
తనకు న్యాయంగా రావాల్సిన పెన్షన్, గ్రాట్యివిటీ, జీపీఎఫ్‌ను ఇవ్వకుండా ఎస్టీవో లంచం అడిగి ఇబ్బందికి గురిచేయడం మూలంగానే ఏసీబీ ని ఆశ్రయించినట్లు ఫిర్యాదుదారుడు వీరభద్ర శ్రీరాములు తెలిపారు. ఆ యన విలేకరులతో మాట్లాడుతూ వర్ధన్నపేట ఈవోపీఆర్డీగా బాధ్యతలు ని ర్వహించి ఉద్యోగ విరమణ చేసినట్లు తెలిపారు. తనకు రావాల్సిన గ్రాట్యివిటీ, జీపీఎఫ్, పెన్షన్‌కు సంబంధించిన డీటీవో, వర్ధన్నపేట ఏస్టీవో అధికారులు నెల రోజుల పాటు ఫైల్ రాలేదని తిప్పుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే నవంబర్ 7న వర్ధన్నపేట ఎస్టీవోకు తన ఫైల్ వచ్చిందని తెలియగానే కార్యాలయానికి వచ్చి ఎస్టీవో విక్రమ్‌కుమార్‌ను కలిసినటు తెలిపారు. దీనికి ఎస్టీవో తనకు రూ.20వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రూ.15వేలు ఇస్తానని చెప్పి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు వివరించారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...