వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి


Sun,November 17, 2019 02:30 AM

-ములుకనూరు పరపతి సంఘం అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి
భీమదేవరపల్లి: సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వృత్తినైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ములుకనూరు సహకార పరపతి సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. శనివారం సహకార పరపతి సంఘం కార్యాలయంలో 66వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా విజయగాథల ద్వారా శిక్షణ, విద్యను నవీకరించుట అనే అంశంపై సభ్యులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు మెరుగైన పనితీరుకోసం సంస్థలో కావాల్సిన మార్పులను తీసుకుని వచ్చేందుకు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు.

సహకార సంఘాల్లో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మహిళలకు తప్పనిసరిగా ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. సహకార పరపతి సంఘం దేశానికే తలమానికమని వరంగల్ కాకతీయ సహకార శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ యాకూబ్ అన్నారు. సహకార సంఘాలు ములుకనూరు సొసైటీని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సహకార విద్యాధికారి రమాదేవి, డిప్యూటీ రిజిస్ట్రార్ నర్సయ్య, సంఘం ఉపాధ్యక్షులు జోడుముంతల వెంకటస్వామి, డైరెక్టర్లు గుడికందుల శంకరయ్య, ఊరడి భారతి, తాళ్లపల్లి సదానందం, పోల్నేని మధుసూదన్‌రావు, అప్పని రాములు, గూడ యాదగిరి, అన్నం తిరుపతిరావు, ఆరెపల్లి రమేశ్, గద్ద అయిలయ్య, ఆర్ వెంకటరెడ్డి, బానోతు కిషన్, చీకట్ల రాజయ్య, జనరల్ మేనేజర్ మార్పాటి రాంరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles