అయోమయం..!


Sat,November 16, 2019 04:21 AM

-కేయూలో 2009-10, 2012-13 నాటి
నియామకాలు రద్దు చేస్తూ నిర్ణయం
-ఆదేశాలు జారీ చేసిన ఇన్‌చార్జి వీసీ జనార్దన్‌రెడ్డి
-అసిస్టెంట్ ప్రొఫెసర్లలో గందరగోళం

వరంగల్ ప్రధానప్రతినిధి, నమస్తేతెలంగాణ: కాకతీయ విశ్వవిద్యాలయంలో 2009-10, 2012-13లో చేపట్టిన అసిస్టెంట్ల ప్రొఫెసర్ల నియామకాన్ని రద్దు చేస్తూ కేయూ ఇన్‌చార్జి వీసీ జనార్దన్‌రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కేయూ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేయూలో 2009-10, 2012-13లో వీసీలు వెంకటరత్నం, లింగమూర్తి హయాంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియమాకాలు చేపట్టారు. అయితే ఈ పోస్టుల భర్తీకి ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆమోదం లేకపోవడమే కాకుండా రోస్టర్ విధానాన్ని పాటించలేదంటూ పలువురు కోర్టుకు వెళ్లారు.

అయితే దీనిపై కేయూ ఈసీ సబ్ కమిటీ సభ్యులు నవీన్ మిట్టల్, ప్రొఫెసర్ మనోహర్, మదన్‌కుమార్, వారం రోజుల పాటు విచారణ జరిపారు. రోస్టర్ లేకుండానే పోస్టులు భర్తీ చేసినట్లు ఈసీకి నివేదిక అందజేశారు. దీంతో కేయూ ఎగ్జిక్యూటీవ్ కమిటీ చైర్మన్ ఇన్‌చార్జి వీసీ జనార్దన్‌రెడ్డి, ఉన్నత విద్యా మండలి కమిషనర్ నవీన్‌మిట్టల్, కేయూ ఈసీ కమిటీ కన్వీనర్ రిజిస్టర్ పురుషోత్తం, సభ్యులు ప్రొఫెసర్ రాజేశం,, మనోహర్, రాజిడ్డి, చంద్రమౌళి, ఉమమహేశ్వర్ తదితరులు సమావేశమై నియామకాల రద్దుపై నిర్ణయం తీసుకున్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...