ఉప సర్పంచ్‌పై వేటు


Sat,November 16, 2019 04:18 AM

ఐనవోలు, నవంబర్ 15: గ్రామాభివృద్ధికి సహకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉపసర్పంచ్‌ను సస్పెండ్ చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం నందనం సర్పంచ్ యాకర మంజుల 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో చేసిన పనుల చెల్లింపు చెక్కులపై ఉప సర్పంచ్ ఆరెల్లి మౌనిక సంతకం చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఎంపీడీవో, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు.ఈమేరకు గురువారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ తొలగించే వరకు ఉప సర్పంచ్ అవిశ్వాసం తీర్మానం ఉంటే తప్ప, ఎటువంటి సమావేశాలకు, విధులకు హాజరుకాకుండదని ఉత్తర్వులో పేర్కొన్నారు.

చర్చనీయాంశంగా సస్పెన్షన్
నందనం ఉప సర్పంచ్ సస్పెన్షన్ మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు ఉలిక్కిపడ్డారు. గ్రామాలభివృద్ధికి కృషి చేయని సర్పంచ్, ఉప సర్పంచ్‌లను తొలగించడం మంచి నిర్ణయమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles