లీగ్ పోటీల్లో జిల్లా క్రికెట్ జట్టు ముందంజ


Sat,November 16, 2019 04:16 AM

వరంగల్‌స్పోర్ట్స్, నవంబర్ 15: హెచ్‌సీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న లీగ్ పోటీల్లో జిల్లా క్రికెట్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాకేశ్-11 జట్టుతో తలపడిన జిల్లా జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 72.1 ఓవర్లలోనే 353 పరుగులు చేసింది. ఇందులో బ్యాట్స్‌మెన్ ప్రదీప్ 62, కుమార్ 36, సాయిచరణ్ 81 పరుగులు చేసి జట్టు విజయంలో ముఖ్య భూమికను పోషించారు.

తర్వాత బరిలోకి దిగిన రాకేశ్-11 జట్టు 51.3 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌట్ కావడంతో వరంగల్ జిల్లా జట్టు 180 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుని విజయకేతనం ఎగురవేసింది. ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డన్‌ను బౌలర్లు అజయ్ 5 వికెట్లు, సురేశ్4 వికెట్లతో కుప్పకూల్చారు. కాగా, ఇప్పటి వరకు లీగ్ దశలో జిల్లా జట్టు ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఆరు మ్యాచ్‌లు విజయం సాధించగా, రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో పూల్ విభాగంలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జట్టును జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు అచ్చా వెంకటేశ్వర్లు, మాజీ ప్రధాన కార్యదర్శి మార్నేని ఉదయభానురావు, బాధ్యులు ఖాజా జమీర్, రఘురాం, బండారి ప్రభాకర్, మట్టెడ కుమార్, అభినవ వినయ్ తదితరులు అభినందించారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...