బాలల హక్కులను పరిరక్షించాలి


Fri,November 15, 2019 03:59 AM

కాజీపేట, నవంబర్ 14: బాలల హక్కులను పరిరక్షించాలని, అప్పుడే దేశ భవిష్యత్ బాగుంటుందని కాజీపేట ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ వీరన్న అన్నారు. కాజీపేట రైల్వే జంక్షన్‌లో బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని సమగ్ర బాలల సంరక్షణ పథకం ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణకు భరోసా మాది- భాగస్వామ్యం మీది అనే అంశంపై అవగాహన, సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీరన్న మా ట్లాడుతూ.. ప్రతి రోజు రైల్వే స్టేషన్ పరిధిలో తప్పిపోయిన పిల్లలు, భిక్షాటన చేస్తున్న వారిని చైల్డ్‌లైన్‌కు అప్పగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, ఆర్పీఎఫ్ ఎస్సై శోభారాణి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విక్టోరియా, రాజ్యలక్ష్మి, రైల్వే అధికారి అగ్గి రవీందర్, చైల్డ్‌లైన్ సభ్యుడు ప్రభాకర్, అంగన్‌వాడీ టీచర్లు, రైల్వే ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...