-వేడుకకు హాజరైన మేయర్, ఎమ్మెల్యే
మిల్స్‌కాలనీ, నవంబర్ 14: గ్రేటర్ పరిధిలోని 9 వ డివిజన్ రాంకీ విల్లా ఓనర్స్ వెల్ఫేర్ అసోసి యేష న్ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాశీవిశ్వేశ్వర నవగ్ర హ అభయాంజనేయ సహిత ఆలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వై భవం గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులు గా నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై ప్ర త్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ రాంకీ విల్లాలోని కాశీవిశ్వేశ్వరాలయం లో నవగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన చేపట్టడం సం తోషకరమని అన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నరేందర్‌ను కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి శ్రీలత, కుడా అడ్వైజరీ మెంబర్ మోడెం ప్రవీణ్, రాంకీ విల్లా ఎండీ నంద కిశోర్, అధ్యక్షుడు ఐ రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తౌటం భాస్కర్, కోశాధికారి కే ప్రవీణ్, సురేందర్, పూర్ణ చందర్‌తోపాటు కాలనీవాసులు పాల్గొన్నారు.