96.22 శాతం ఓటర్ల పరిశీలన


Thu,November 14, 2019 04:54 AM

-జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పరిశీలన
-మిగిలిన ఓటర్ల వివరాల వెరిఫికేషన్ పది రోజుల్లో పూర్తి
-వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ వెల్లడి

అర్బన్ కలెక్టరేట్, నవంబర్ 13 : జిల్లాలోని మూడు శాసనసభ నియోజక వర్గాల పరిధిలో నమోదైన 7,22,459 మంది ఓటర్లలో 6,94,631(96.22 శాతం ) ఓటర్ల పరిశీలన పూర్తి అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రజత్‌కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెమోగ్రాఫికల్‌గా ఒకే విధంగా నమోదైన 4870 ఓటర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి 2247 మంది ఓటర్లను రికార్డుల నుంచి తొలిగించామని అన్నారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ పరిశీలన చేసిన 6,94,631మంది ఓటర్లలో 6,92,787 ఎంట్రీలు సక్రమంగా ఉన్నాయని అన్నా రు. మిగిలిన 27,288 మంది ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోం దన్నారు. 10 రోజులలో వెరిఫికేషన్ పనులు పూర్తవుతాయని తెలిపారు. జిల్లాలోని 724 పోలింగ్ కేంద్రాల నజరీ నక్ష ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో స్పెషల్ కలెక్టర్ మనుచౌదరి, వర్ధన్నపేట ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వైవీ.గణేశ్, తహసీల్దార్లు పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...