కాళోజీ నేటి యువతకు ఆదర్శం


Thu,November 14, 2019 04:50 AM

హసన్‌పర్తి, నవంబర్ 13: మరణానంతంర తన దేహాన్ని సైతం సమాజానికి అంకితం చేసిన గొప్ప మహనీయుడు ప్రజాకవి కాళోజీ అని జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు బి.కుమార్ అన్నారు. స్థానిక బాలుర జెడ్పీహెచ్‌ఎస్‌లో ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు వర్ధంతి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఆయన ఆశయాలను నేటి యువ త ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చా రు. ఆశయాలను, స్ఫూర్తిని ప్రతి విద్యార్థి అలవర్చుకొని మంచి సమాజ నిర్మాణంలో భాగం కావాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎన్.రాజయ్య, సమ్మ య్య, జి.లక్‌పతి, ఎండీ.ఫసియోద్దీన్, అర్చన, సుశీల, పద్మజ, సంజయ్, సరళ, విద్యార్థులు పాల్గొన్నారు.

కమలాపూర్‌లో...
కమలాపూర్: మండల కేంద్రంలోని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్వగృహంలో కాళోజీ నారాయణరావు వర్ధంతిని టీఆర్‌ఎస్ నాయకులు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు ఆశయాలను కొనసాగించాలని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ కట్కూరి విజయతిరుపతిరెడ్డి, ఉపసర్పంచ్ మౌటం రమేశ్, రైతు సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు శ్రీకాంత్, లక్ష్మణ్‌రావు, రాములు, అరవింద్, పిల్లి సతీశ్, కొల్గూరి రాజ్‌కుమార్, మౌటం సంపత్, పుల్ల శోభన్‌బాబు, మాడిశెట్టి చంద్రశేఖర్, పబ్బు సాంబయ్య, సంపత్, మొగిలి తదితరులు పాల్గొన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...