కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ధర్నా


Thu,November 14, 2019 04:49 AM

కమలాపూర్: మండలంలోని గూడూరులో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు బుధవారం ధర్నా చేపట్టారు. ఖరీఫ్‌లో వరిపంట కోతలు మొదలై ఇరవై రోజులు అవుతున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించడం లేదని కమలాపూర్-హన్మకొండ రహదారిపై ఎడ్లబండ్లు నిలిపివేసి రాస్తారోకో చేశారు. చేతికందిన పంట వర్షాలతో నేలవాలిపోయి తీవ్ర నష్టాలపాలైన రైతులను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పది రోజులు అవుతున్నా కమలాపూర్ మండలంలో మొదలు చేయడం లేదన్నారు. ఓ వైపు మబ్బులు వస్తుండటంతో ధాన్యం ఆరబోస్తు కుప్పలు పోస్తూ ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. కార్యక్రమంలో రైతులు, నాయకులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...