భీమదేవరపల్లి: శ్రమదానంలో పోలీసులు చురుకుగా భాగస్వామ్యం అవుతున్నారు. బుధవారం వంగర ఠాణాను ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్‌జీ అకస్మిక తనిఖీ చేశారు. అనంతరం రోడ్డుకు ఇరువైపుల ఏపుగా పెరిగిన చెట్లపొదలు, ముళ్ల కంచెలను పరిశీలించారు. వీటి కారణంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉందని ఎస్సై ఉపేందర్‌తో చర్చించారు. వెంటనే వంగర నుంచి ములుకనూరు సమ్మక్క-సారలమ్మ గుట్ట వద్దకు రోడ్డుకు ఇరువైపుల ట్రాక్టర్‌తో చెట్లపొదలను తొలగించారు. ప్రమాదాలు జరుగకుండా మూలమలుపుల వద్ద ప్రమాద సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలని ఎస్సై ఉపేందర్‌ను ఆదేశించారు. అనంతరం ములుకనూరు, ఎల్కతుర్తి ఎస్సైలు టీవీఆర్ సూరి, శ్రీధర్‌లతో కాసేపు మాట్లాడారు. వీరితో పాటు పోలీసు సిబ్బంది సంపత్, యాదగిరి, నయిమ్, గోవర్థన్, మోహన్, శంకర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.