మార్నేని రవీందర్‌రావుకు ఎమ్మెల్యే జెడ్పీ చైర్మన్ పరామర్శ


Thu,November 14, 2019 04:47 AM

ఐనవోలు : పితృవియోగం పొందిన ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్ రైతు విభాగం అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావును హుస్నాబాద్ ఎమ్మెల్యే ఓడితెల సతీశ్‌కుమార్, వరంగల్ అర్బన్ జిల్లా జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ బుధవారం రాత్రి పరామర్శించారు. రవీందర్‌రావు తండ్రి మాధవరావు ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐనవోలు చేరుకున్న ఎమ్మెల్యే , జెడ్పీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, సోదరుడు రఘువీరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, భీమదేవరపల్లి ఎంపీపీ అనిత రమేశ్, జెడ్పీటీసీ వంగ రవి, ఎక్కతుర్తి ఎంపీపీ మేకల స్వప్న, జిల్లా కోఆప్షన్ సభ్యుడు ఉస్మాన్‌అలీ, నాయకులు చందర్‌రావు, రవీందర్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మార్నేని రవీందర్‌రావును, మండలంలోని వివిధ గ్రామాల ఎంపీటీసీలు పరామర్శించారు. ఎంపీపీ మార్నేని మధుమతి రవీందర్‌రావు, సోదరుడు రఘువీరరావును, కుటుంబ సభ్యులను పరార్శించి, ప్రగాఢ సానుభూభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో వైస్ ఎంపీపీ తంపుల మోహన్, మండల కోఆప్షన్ సభ్యుడు గుంషావళి, మేరుగు రాజేందర్, రమేశ్, రాజు, సోమేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోలెపల్లి శంకర్‌రెడ్డి, నాయకులు అనిల్ ఉన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...