దామోదర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి పరామర్శ


Thu,November 14, 2019 04:46 AM

ఐనవోలు నవంబర్ 13 : మాజీ డీసీసీబీ చైర్మన్ దోపతి దామోదర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం పరామర్శించారు. దామోదర్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఎర్రబెల్లి ఆయన అంతిమయాత్రంలో పాల్గొని పాడె మోసి కన్నీటి పర్యంతం అయిన విషయం విధితమే. ఈ మేరకు ఆరో డివిజన్ సింగారం లోని దామోదర్‌రెడ్డి ఇంటికి చేరుకున్న దయాకర్‌రావు దామోదర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా అదుకుంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఉమ్మడి జిల్లా యువజన విభాగం అద్యక్షుడు ఇండ్ల నాగేశ్వర్‌రావు, మాజీ సర్పంచ్ దోపతి జయపాల్‌రెడ్డి, నాయకులు శివరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...