నగరంలో నాలాల కబ్జా..!


Wed,November 13, 2019 03:16 AM

వరంగల్‌, నమస్తేతెలంగాణ: నగరంలోని నా లాలు యథేచ్ఛగా కబ్జా అవుతున్నాయి. నాలుగు ప్రధాన నాలాలపై వందల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా బల్దియా మిన్నకుండిపోతున్నది. బడాబాబుల రుబాబులకు భయపడి అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో అరగంటపాటు కుండపోత వర్షం కురిసినా నగరం ఆగమాగం అవుతున్నది. పర్యాటక హబ్‌గా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుతం తరుణంలో ముంపు నగరాల జాబితా లో చేరకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సి న అవసరం ఉన్నది. మరికొద్ది రోజుల్లో అమల్లోకి వచ్చే కొత్త మాస్టర్‌ప్లాన్‌లో చెరువులు, నాలాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన మాస్టర్‌ప్లాన్‌ సమీక్ష సమావేశంలో నాలాలు, చెరువుల పరిరక్షణపై పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా ఇరిగేషన్‌, రెవెన్యూ, బల్దియా అధికారులు సమన్వయంతో రికార్డుల ప్రకారం నాలాల వాస్తవ వి స్తీర్ణాన్ని గుర్తించాలని, నిబంధనల ప్రకారం బఫర్‌ జోన్లను నిర్ణయించాలని మంత్రి సూచించినట్లు సమాచారం. అతి త్వరలో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను ప్రభు త్వం ఆమోదించనున్న నేపథ్యంలో వారం రోజు ల్లో తుది నివేదిక అందజేయనున్నారు. మం త్రి కేటీఆర్‌ సూచనలను పరిగణలోకి తీసుకోని కుడా అధికారులు నివేదికను రూపొందిస్తున్నారు. ప్ర స్తుతం నగరంలోని నాలుగు నాలాల ఆక్రమణ లు, ఏ నాలాపై ఎన్ని నిర్మాణాలు జరిగాయన్న పూర్తి సమాచారం కుడా అధికారులు సేకరిస్తున్నా రు. కొత్త మాస్టర్‌ప్లాన్‌ ప్రభుత్వ ఆమోదం పొంది అమల్లోకి వచ్చిన వెంటనే నాలాలు, చెరువుల కబ్జాలపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది.

వందల అక్రమ నిర్మాణాలు
నాలాలపై వందల అక్రమ నిర్మాణాలు జరిగా యి. గతంలో జరిగిన వాటితో పాటు ఇప్పటికీ నా లాలను ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నా యి. ముఖ్యంగా గోపాల్‌పూర్‌-నయీంనగర్‌ మీదుగా వెళ్లే నాలాపై ఇప్పటికే 50కి పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే బడాబాబుల నిర్మాణాలు కావడంతో అధికారులు ఏమి చేయలేకపోతున్నారు. సాకరాశికుంట, భద్రకాళీ నాలాపై అనేక నిర్మాణాలు ఉన్నట్లు చెబుతున్నారు. 60 ఫీట్ల నాలాలు ఆక్రమణలతో ఒక్కో చోట 20 ఫీట్లకు కుదించుకపోయాయని అధికారులు అంటున్నారు. రెండేళ్ల క్రితం భారీ వర్షంతో నగరం ముంపునకు గురైన నేపథ్యంలో ఇరిగేషన్‌, రెవె న్యూ, బల్దియా అధికారులు వారం రోజుల పాటు నాలా ఆక్రమణలపై సర్వే చేసి తొలగింపునకు ప్రయత్నాలు చేశా రు. అయితే బడాబాబుల నిర్మాణాలు ఉండటంతో ఆ ప్రయత్నం మధ్యలోనే ఆగిపోయింది. కొత్త మాస్టర్‌ప్లాన్‌ అమల్లోకి వస్తే నాలాల ఆక్రమణలపై కొరడా ఝ లిపించవచ్చని అధికారు లు భావిస్తున్నారు. జవహర్‌నగర్‌ ప్రాంతం లో నాలాను ఆక్రమించి అనే క నిర్మాణా లు జరిగినట్లు ఇటీవల చేసిన సర్వేలో గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.
22.29 కిలో మీటర్ల నాలా
నగరం 22.29 కిలోమీటర్ల మేర నాలా ఉం ది. ప్రతి నాలా 60 ఫీట్ల వెడల్పు ఉండేవని అధికారులు పేర్కొంటున్నారు. భట్టుపల్లి నుంచి భద్రకాళీ వరకు 5.46 కిలోమీటర్ల నాలా ఉంది. భద్రకాళీ - పెద్దమ్మగడ్డ మీదుగా వెళ్లే నాలా 7 కిలోమీటర్లు ఉంది. వడ్డెపల్లి చెరువు నుంచి గోపాల్‌పూర్‌ మీదుగా నయీంనగర్‌ నుంచి కాకతీయ కెనాల్‌ వరకు నాలా 8.33 కిలోమీటర్లు. శాకరాశికుంట నుంచి బొందివాగు వరకు 1.5 కిలోమీటర్ల నాలా ఉంది. అయితే నగరంలోని నాలుగు నాలాలు చివరికి ముచ్చర్ల నాగారం చెరువులోకి వెళ్లి కలుస్తాయి. నగరంలోని ప్రధాన నాలాలు ఇప్పటికే అనేక చోట్ల కబ్జా చేశారు. దీంతో చిన్నపాటి వర్షానికే వరద నీరు రోడ్లపై పోటెత్తుతున్నాయి.


98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...