ఎమ్మెల్సీ పోచంపల్లిని కలిసిన కుడా చైర్మన్ మ్రర్రి యాదవరెడ్డి


Tue,November 12, 2019 02:48 AM

వరంగల్,నమస్తేతెలంగాణ : హన్మకొండలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. రెండోసారి కుడా చైర్మన్‌గా నియమితులు కావడానికి సహకరించిన సందర్భంగా ఆయనకు యాదవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, రాష్ట్ర రైతు రుణవిమోచన సంస్థ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యం కుడా చైర్మెన్ యాదవరెడ్డిని కలిసి అభినందించారు. కుడా కార్యాలయానికి వచ్చిన ఆయన పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...