అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం


Tue,November 12, 2019 02:48 AM

కరీమాబాద్, నవంబర్ 11 : అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. సోమవారం 21వ డివిజన్ కార్పొరేటర్ మేడిది రజిత ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ ప్రతి డివిజన్‌లో మౌళిక వసతులను కల్పించి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని అన్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి ఎల్లవేళలా గుర్తుండేలా పనులు చేపడతామన్నారు. మేయర్ ప్రకాశ్‌రావు మాట్లాడుతూ వరంగల్ మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి డివిజన్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. నగరంలోని మురికివాడలను అభివృద్ధి చేస్తామని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మేడిది రజిత, మరుపల్ల భాగ్యలక్ష్మి, కుడా సలహామండలి సభ్యుడు మోడెం ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ నాగపురి కల్పన టీఆర్‌ఎస్ నాయకులు మరుపల్ల రవి, మేడిది మధుసూదన్, నాగపురి సంజయ్‌బాబు, కొమ్మిని సురేశ్, బజ్జూరి వాసు, బత్తిని అఖిల్, పుట్ట భోగేశ్వర్, వంచనగిరి సమ్మయ్య, బిట్ల క్రాంతి, వొడ్నాల నరేందర్, బండి కుమారస్వామి, పొగాకు సందీప్, పార్వతి కృష్ణంరాజు, బండి వీరన్న, శెట్టి రాజు, ఎరుకల మహేందర్, బొల్లం ప్రతాప్, సమీ, ఎలగొండ రవి, నీలం మల్లేశం, కళావతి, యాగబోయిన దయాకర్, బోరిగం నాగరాజు, శేర్ల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...