విద్యార్థులకు అభినందన


Tue,November 12, 2019 02:48 AM

హసన్‌పర్తి, నవంబర్ 11: జాతీయస్థాయి త్రోబా ల్ పోటీలకు పెంబర్తి ఏకశిలా ఈ టెక్నోస్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు విద్యా సంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన విద్యార్థుల అభినందన సభలో మాట్లాడారు. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో త్రోబా ల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరుపున ప్రాతిని ధ్యం వహించిన సాన్విత, నాగచైతన్య, శ్రీజ్ఞ, క్రాం తి, శృతి, మానవ, స్పందన, సుష్మ, సాయిచరణ్, వివేక్‌ప్రణయ్‌ను ఆయన అభినందించారు. విద్యా ర్థులకు ఉత్తమ శిక్షణనందించిన వ్యాయామ ఉపాధ్యాయులను, నైపుణ్యాలను ప్రదర్శించిన క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో శారద, ఏ కశిలా విద్యా సంస్థల వ్యాయామ ఉపాధ్యాయులు రవి, దేవేందర్, కుమార్, రాజశేఖర్, ప్రణయ్, రా మక్రిష్ణ, పాఠశాల డైరెక్టర్ జీ సువిజారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జీ ఫణిమోహన్‌రావుతోపాటు అధ్యాపక సిబ్బ ంది, విద్యార్థులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...