కూలీలకు పని కల్పించాలి: ఎంపీడీవో


Tue,November 12, 2019 02:48 AM

ధర్మసాగర్, నవంబర్ 11: జాతీయ ఉపాధి హా మీ పథకంలో 2020-21 సంవత్సరంలో చేపట్టబోయే పనులను గుర్తించి, కూలీలకు పని కల్పించాలని ఎంపీడీవో జీ జవహర్‌రెడ్డి అన్నారు. సోమవా రం ధర్మసాగర్ గ్రామ సర్పంచ్ ఎర్రబెల్లి శరత్ చం ద్రప్రసాద్, రాపాకపల్లె సర్పంచ్ కందుకూరి వినోద అధ్యక్షతన సోమవారం ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా ఎం పీడీవో జవహర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామాల్లో జాబ్ కార్డులు ఉన్న కూలీకి పని కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. వేసవి కాలంలో చేపట్ట నున్న పనుల కోసం ముందస్తుగానే ప్రణాళికలను తయారు చేసుకోవాలని, ముఖ్యంగా ప్రతి గ్రామం లో నర్సరీలను ఏర్పాటు చేసి, విరివిగా మొక్కలు నాటాలన్నారు. త్వరలోనే ప్రతి గ్రామానికి జనాభా ప్రకారం ట్రాక్టర్లు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శి గో పు రఘుపతిరెడ్డి, ఏపీఎం సంపత్, ఎంపీటీసీలు రొండి రాజయ్య, ఉప సర్పంచ్ బొడ్డు అరుణ, టీఏ లు, వార్డు సభ్యులు, గ్రా మస్తులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...