త్వరలోనే కొత్త మాస్టర్ ప్లాన్


Tue,November 12, 2019 02:48 AM

వరంగల్,నమస్తేతెలంగాణ : నగర ప్రజలు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న కొత్త మాస్టర్ ప్లాన్ త్వరలోనే ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుందని కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి అన్నా రు. సోమవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త మాస్టర్‌ప్లాన్ నగరాభివృద్ధ్దికి దిశానిర్దేశం చేయనుందని అన్నా రు. వారం రోజుల్లో కొత్త మాస్టర్‌ప్లాన్‌పై పూర్తి స్థాయి నివేదిక కలెక్టర్‌కు అందజేస్తామని అన్నా రు. కాగా, తనను రెండోసారి కుడా చైర్మన్‌గా నియమించిన సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సహకరించిన ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగర ప్రజలకు కొత్త సంవత్సర కానుకగా భద్రకాళీ బండ్‌ను మున్సిపల్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జనవరిలో ప్రారంభిస్తామని అన్నారు. 2016లో కుడా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నగరాభివృద్ధి, కుడాను ఆర్థికంగా బలోపేతానికి ఎంతో కృషి చేశానని అన్నారు. కుడా కార్యాలయంలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని, బయోమెట్రిక్ హాజరుతో పాటు ఎల్‌ఆర్‌ఎస్ మేళాలు ఏర్పాటు చేశామని అన్నారు.

రూ.10 వేలు చెల్లించి మిగతా డబ్బులు చెల్లించకుండా, డాక్యుమెంట్లు అందజేయకుండా ఉన్న వారికి డిసెంబర్ 31 వరకు చివరి అవకాశం కల్పించామని అన్నా రు. ఇప్పటి వరకు 18 వేల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను క్లీయర్ చేశామని, 2 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. 7 వేల మంది కేవలం రూ.10 వేలు చెల్లించి దరఖాస్తులు చేసుకుని వదిలేశారని అన్నారు. మూడేళ్ల పదవీ కాలం లో 100 లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చామని, కుడా అపార్ట్‌మెంట్లలో ప్లాట్ల వేలం, ఓ-సిటీ, మడిపల్లిలో ప్లాట్ల వేలం ద్వారా కుడాను అర్థికంగా పరిపుష్టి చేశానన్నారు. విలీన గ్రామాల్లో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతామని అన్నారు. హెచ్‌ఎండీఏ తరహాలో కుడా ల్యాండ్ ఫూలింగ్‌కు శ్రీకారం చుడుతామని అన్నారు. 500 ఎకరాలను సేకరించడం ద్వారా రూ.వెయ్యి కోట్ల నిధులను సమకూర్చుతామని అన్నారు. సమావేశంలో కుడా ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్‌రావు, కార్యదర్శి మురళీధర్‌రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...