ఆలిండియా యూనివర్సిటీ రెజ్లింగ్ పోటీలకు


Tue,November 12, 2019 02:47 AM

-కేయూ పురుషుల జట్టు ఎంపిక
రెడ్డికాలనీ, నవంబర్ 11: ఈనెల 14 నుంచి 19 వరకు హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ గురు జంబేశ్వర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో జరిగే ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ రెజ్లింగ్ పోటీలకు కాకతీయ యూనివర్సిటీ నుంచి పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు ఆచార్య సురేశ్‌లాల్ సోమవారం తెలిపారు. ఎంపికైన వారిలో ఎల్ చంద్రశేఖర్, వినయ్, జీ వెంకటేశ్, మహమ్మద్ హఫీజ్, వెంకటప్రసాద్, కే అనిరుద్, టీ వెంకటేశ్, సురేశ్, వీ జయపాల్, వీ పూర్ణసాయి, అఖిల్, సీహెచ్ అఖిల్, జీ తిరుపతి, పీ రాజ్‌కుమార్ ఉన్నారు. జట్టు కోచ్‌గా కే రాజు వ్యవహరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను ఇన్‌చార్జి వీసీ డాక్టర్ బీ జనార్దన్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే పురుషోత్తం అభినందించారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...