ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి


Mon,November 11, 2019 01:40 AM

మడికొండ, నవంబర్ 10: ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ సూచించారు. కాజీపేటలోని జామా మసీదులో మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని ఫారుఖ్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ఏసీపీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ప్రమాదంలో ఉన్న మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. ముస్లిం యువకులు పెద్ద ఎత్తున హాజరై రక్తదానం చేశారు. కార్యక్రమంలో కాజీపేట ఇన్‌స్పెక్టర్ నరేందర్, పీస్ కమిటీ సభ్యులు ఎండీ సోని, ఎస్‌డీ సర్వర్, మహమూద్, ఇమామ్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

భక్తి శ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ వేడుకలు
హసన్‌పర్తి : గ్రేటర్ 58వ డివిజన్ పరిధి ఆరెపల్లిలో ఆదివారం మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించు కొని మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వీర భిక్షపతి మసీదులో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని షేక్ ఆదాం ప్రారంభించారు. కార్యక్రమంలో షేక్ ఉస్మాన్, ఎండీ.ఖాదర్, ఎండీ.అప్సర్, ఎండీ.షరీఫ్, ఎండీ.అజ్జు, ఎండీ.అల్లీన్, షేక్ అజీ తదితరులు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...