పలు కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ


Mon,November 11, 2019 01:39 AM

ధర్మసాగర్, నవంబర్ 10 : మండలంలోని ముప్పారంలో శ్యామల సక్కుబాయి (70) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది. ఎమ్మెల్యే రాజయ్య మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట వేలేరు జెడ్పీటీసీ చాడ సరిత, సర్పంచ్ గోనెల సమ్మక్క, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి కందూకురి ప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షుడు బూర రమేశ్, నాయకులు వస్కుల శ్రీనివాస్, ఎల్లయ్య, గడ్డం రాజేందర్, అన్నం లక్ష్మినారాయణ ఉన్నారు. కాగా మండలంలోని 54వ డివిజన్ ఉనికిచర్లకు చెందిన గుర్రాల నాగరాజు రెండు రోజుల క్రితం విద్యుత్‌షాక్‌తో గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఎమ్మెల్యే రాజయ్య పరామర్శించి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట నియోజకవర్గ ఎస్సీ సెల్ కన్వీనర్ మైస ఏలీయా, గ్రామ శాఖ అధ్యక్షుడు పూల దేవేందర్, రంజిత్ ఉన్నారు. అనంతరం వేలేరు మండలంలోని పీచరకు చెందిన మల్కిరెడ్డి రామ్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనను పరామర్శించారు. మండల పార్టీ అధ్యక్షుడు కీర్తి వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జి రాజేశ్వర్‌రెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, సోమిరెడ్డి పరామర్శించిన వారిలో ఉన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...