లక్ష్మీ బరాజ్‌లో 5 గేట్ల ఎత్తివేత


Mon,November 11, 2019 01:39 AM

మహదేవపూర్, నవంబర్ 10 : మండలంలోని అంబట్‌పల్లి పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన లక్ష్మీ (మేడిగడ్డ)బరాజ్‌లో క్రమం క్రమంగా నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతుంది. దీంతో ఆదివారం 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్లు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు. కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కురిసిన వర్షాల కారణంగా ప్రాణహిత నదీ ప్రవాహం గోదావరి నదిలోకి వచ్చి చేరి లక్ష్మీ బరాజ్ మీదుగా ప్రవహిస్తుండడంతో గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, నీటి ప్రవాహం పెరుగుతూ, తగ్గుతూ వస్తుండడంతో గేట్లను పెంచుతూ, తగ్గిస్తూ నీటిని దిగువకు తరలిస్తున్నారు. శనివారం 7 గేట్లకు ఎత్తి నీటిని తరలించిన అధికారులు ఆదివారం మరో రెండు గేట్లను మూసివేసి 5 గేట్ల ద్వారా నీటిని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. బరాజ్‌లో 93.30 మీటర్ల ఎత్తులో 2.645 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 39 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 30 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతున్నట్లు తెలిపారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...