రామప్ప, లక్నవరంలో విదేశీయుల సందడి


Mon,November 11, 2019 01:39 AM

వెంకటాపూర్/గోవిందరావుపేట: సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన రామప్ప ఆలయంతోపాటు లక్నవరం సరస్సును ఆస్ట్రేలియా దేశస్తులు ఆదివారం సందర్శించారు. రామప్ప ఆలయంలోని రామలింగేశ్వరుడికి వారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. గైడ్ విజయ్‌కుమార్ వారికి రామప్ప విశిష్టతను వివరించారు. తమ కెమెరాల్లో రామప్ప శిల్పసంపదను బంధించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామప్ప అందాలు అద్భుతమని కితాబిచ్చారు. లక్నవరం చేరుకున్న వారు సరస్సులో బోటు షికారు చేశారు. లక్నవరం అందాలకు ఫిదా అయ్యారు. రెస్టారెంట్‌లలో భోజనం చేశారు. గుత్తి వంకాయ కూరతోపాటు రసం, పెరుగుతో తెలంగాణ రుచులను ఆస్వాదించారు. తెలంగాణ వంటకాలు బాగున్నాయంటూ కితాబిచ్చారు. సరస్సుపై రెండు వేలాడే వంతెనలు సరస్సుకు మరింత అందాన్ని తెచ్చాయన్నారు. ఇక్కడి అందాలు, తీపి గురుతులను తాము ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. ఈ సందర్భంగా వారికి లక్నవరం యూనిట్ మేనేజర్ పుల్లారెడ్డి లక్నవరం డాక్యుమెంటరీపై క్లుప్తంగా వివరించారు. కాగా, ఇటు పర్యాటకులు, విదేశీయులతో లక్నవరం ప్రాంతంలో సందడి వాతావరణం కనిపించింది.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...