-అభివృద్ధిలో దూసుకుపోతున్న జిల్లా
-అన్నివర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం
-ప్రభుత్వచీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్
సిద్ధార్థనగర్, నవంబర్ 09 : అభివృద్ధిలో వరంగల్ జిల్లా దూసుకుపోతుందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావుతో పాటు మాజీ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. శనివారం గ్రేటర్ వరంగల్ 49 డివిజన్లోని మండల ఆఫీసు సమీపంలో రూ.50 లక్షలతో సీసీరోడ్డు, డ్రైనేజీ నిర్మాణం, ముదిరాజ్‌వాడలో ముదిరాజ్ భవన్ కమ్యునిటీ హాల్ నిర్మాణం కోసం రూ.1.50కోట్లతో, 50వ డివిజన్లోని శ్యామల దుర్గాదాస్ కాలనీలో రూ.75లక్షలతో పార్కు పనులకు శంకుస్ధాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జిల్లా అభివృద్ధిలో ముందుందని, రానున్న రోజుల్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లాకు మరింత నిధులు ఇస్తారని చెప్పారు. నగరంలో టూరిస్టు హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల సహకారంతో నగరం అభివృద్ధి చెందుతుందని అన్నారు. వడ్డెపల్లి అభివృద్ధ్ది కమిటీతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు హాజరై వడ్డెపల్లి వాసులు ఐక్యంగా ఉండి, అభివృద్ధిని సాధించుకోవాలని సూచించారు. కార్పొరేటర్లు దాస్యం విజయ్‌భాస్కర్, కేశబోయిన అరుణశ్రావణ్, స్వప్న, జాగృతి రాష్ట్ర నాయకులు కోరబోయిన విజయ్‌కుమార్, డీఈ సంతోష్‌బాబు, సుబేదారి సీఐ అజయ్‌కుమార్, ఎస్సై నవీ న్, టీఆర్ఎస్ నాయకులు బబ్బు, విపుల్, చిన్నా, మధు, వేణు, నవీన్, జైపాల్, రాజు, శ్రీను, రాంరాజ్ పాల్గొన్నారు.