పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం


Sun,November 10, 2019 01:50 AM

కమలాపూర్, నవంబర్ 09: చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం ఐఎల్‌వో 138 చట్టం ప్రకారం నేరమని కృషి విజ్ఞాన కేంద్రం భారత సుస్థిర పత్తి యాజమాన్య పథకం ఫీల్డ్ ఫెసిలిటేటర్ కందుకూరి సాయికుమార్ అన్నారు. మండలంలోని కానిపర్తి, నేరెళ్ల గ్రామాల్లో పత్తి పంట క్షేత్రాల్లోని కూలీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామీణ నవ నిర్మాణ సమితి బీసీఐ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు శనివారం జరిగింది. ఈ సందర్భంగా సాయికుమార్, బొచ్చు రాజేందర్ రైతు కూలీలతో మాట్లాడారు. వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు చిన్న పిల్లలచే పనులు చేయించడం బాలకార్మిక చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని, బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు అధిక లాభాలు పొందాలంటే పత్తి ఏరే సమయంలో ఎటువంటి చెత్తాచెదారం లేని, నూలు సంచి దారాలు, వెంట్రుకలు కలువకుండా జాగ్రత్త పడాలన్నారు. కూలీలు సరైన దస్తులు వాడితేనే ఇది సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో రైతులు కుమారస్వామి, చందర్‌రావు, కూలీలు, రమ, విజయ, స్వప్న, భాగ్య తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...