ఎగవేసిన పన్ను బకాయి రూ.75.42 కోట్లు


Sat,November 9, 2019 04:27 AM

-వసూలుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి
-అవసరమైతే రెవెన్యూ రికవరీ చట్టం వర్తింప చేయాలి
-అధికారులకు కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ ఆదేశం

అర్బన్ కలెక్టరేట్, నవంబర్ 08: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్ 2వ తేదీ నుంచి 2019 ఆగస్టు నెలాఖరు వరకు ఉద్దేశపూర్వకంగా రూ.75.42 కోట్ల పన్ను ఎగవేసినట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌శాఖ అధికారులు గుర్తించారని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ఈ సొమ్ములో రూ.2.34 కోట్లు వసూలు కాగా, ఇంకా రూ.73.07 కోట్లు వసూలు కావ ల్సి ఉందన్నారు. ఈ బకాయిని రాబట్టేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, అవసరమైతే రెవెన్యూ రికవవీ చట్టంను వర్తింప చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఆదాయార్జన శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెగ్యులర్‌గా ఇచ్చే నోటీసులతో ఉపయోగం లేదని, ప్రతి కేసును అధికారులు వ్యక్తిగతంగా మానిటరింగ్ చేయాలన్నారు. రెండు నెలల్లో వంద శా తం వసూలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. 2014 నుంచి ప్రతి సంవత్సరం ఉన్న బకాయిదారుల జాబితాను తీసుకొని పె ద్ద మొత్తంలో ఎగవేసిన వారిపై దృష్టి సారించాలని అన్నారు. ఈనెలాఖరు వరకు 50శాతం బకాయిలు వసూలు కావాలన్నా రు.

ఈ అంశంపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉద్దేశ్యపూర్వకంగా ఎగవేతదారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. కొన్ని శాఖల్లో కోట్ల రూపాయలు పన్నులు ఎగవేతలు ఉన్నప్పటకీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పన్నుల ఎగవేతదారులను సుమోటగా గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. కామన్ గుడ్‌ఫండ్ కింద దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 51 ఆలయాల కార్యనిర్వహణాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. హోటళ్లు, కిరాణం షాపులు, రైస్‌మిల్లుల నుంచి ఆహార భద్రత శాఖకు రావల్సిన ఫుడ్‌సేప్టీ లైసెన్స్ ఫీజు ఎగవేత ల వసూళ్లకు చేపట్టిన చర్యలు శూన్యం అని అన్నారు. గుడ్డిగా వ్యాపారస్తులు చెప్పిన టర్నోవర్‌ను ఎలా పరిగణలోకి తీసుకుంటారని కలెక్టర్ ప్రశ్నించారు. కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి టర్నోవర్ వివరాలు తీసుకొని పన్నుల ఎగవేతలు అరికట్టాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజుల ఎగవేత బకాయిలను వసూలు చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులతో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని వరంగల్ నగరపాలక సంస్థ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

మైనింగ్‌శాఖ పన్నుల ఎగవేతలు రూ.48లక్షలు ఉన్నప్పటికీ స రైన విధంగా స్పందిండం లేదన్నారు. పన్ను ఎగవేసిన 52 కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని వాణిజ్య పన్నులశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ట్రాన్స్‌ఫోర్టు బకాయిల వసూళ్లలో భాగంగా రోడ్ పర్మిట్స్‌ను రద్దు చేయించాలని ఆయన పేర్కొన్నారు. అక్రమ లేవుట్లు, వెంచర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. నాలా కన్వర్షన్ పన్నులను వంద శాతం వసూలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ కలెక్టర్ మనుచౌదరి, డీఆర్వో పీ మోహన్‌లాల్, ఆర్డీవో కే వెంకారెడ్డి, గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ నాగేశ్వర్‌రావు, ప్రాంతీ య విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఏఎస్పీ బీ శ్రీనివాస్‌రె డ్డి, వాణిజ్య పన్నుల అధికారి సుధాకర్‌రెడ్డి, దేవాదాయశాఖ, కుడా, ఫైర్‌సేఫ్టీ, మైనింగ్, రిజిస్ట్రేషన్, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...