గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు


Sat,November 9, 2019 04:24 AM


కమలాపూర్: ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు విక్రయి స్తే పీడీయాక్ట్ నమోదు చేస్తామని సీఐ రవిరాజు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మండలంలోని పలు గ్రామాల కిరాణ వ్యాపారులు, గుట్కా వ్యాపారులకు, పాత నేరస్తులకు సీఐ కౌన్సెలింగ్ చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు హాని కల్గించే అం బర్, జర్దా, గుట్కాలను విక్రయించరాదని, ప్రభుత్వం నిషేధించిందన్నారు. పలు మార్లు గుట్కా, అంబర్ ప్యాకెట్లు అ మ్మకాలు చేపట్టవద్దని సూచించినా వ్యాపారులు అదే పనిగా విక్రయాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గు ట్కా, అంబర్ ప్యాకెట్ల వ్యాపారం చేస్తూ కేసులు నమోదు అయిన పాత నేరస్తులు వ్యాపారం మానుకోవాలన్నారు. లే దంటే చట్టపరమైన చర్యలతోపాటు పీడీ యాక్ట్ నమోదు చే స్తామని ఆయన అన్నారు. గుట్కా, అంబర్ ప్యాకెట్ల దందా పై పోలీస్ నిఘా ఉంటుందని, వ్యాపారులు జాగ్రత్తగా ఉం డాలని అంబర్, గుట్కా ప్యాకెట్లు దొరికితే తీవ్ర పరిణామా లు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు సూర్యప్రకాశ్, సందీప్‌కుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...