లక్ష్మీ బరాజ్‌లో 15 గేట్ల ఎత్తివేత


Sat,November 9, 2019 04:23 AM


- 78 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 80 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ..
మహదేవపూర్, నవంబర్ 08: జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్‌పల్లి పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్‌లో శుక్రవారం 15 గేట్లను ఎత్తివేసి నీటిని తరలిస్తున్నట్లు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కురిసిన వర్షాల కారణంగా ప్రాణహిత నది ప్రవహిస్తూ గోదావరిలోకి వచ్చి చేరింది. లక్ష్మీ బరాజ్ మీదుగా ప్రవహిస్తుండడంతో కొన్ని రోజులుగా గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఇటీవల నీ టి ప్రవాహం పెరుగుతూ, తగ్గుతూ వస్తుండడంతో గేట్లను పెంచు తూ, తగ్గిస్తూ దిగువకు తరలిస్తున్నారు. బరాజ్‌లో 92.70 మీటర్ల ఎత్తులో 2.098 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే 78 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 80 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతున్నట్లు వారు తెలిపారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...