సాఫీగా ప్రయాణం


Fri,November 8, 2019 03:26 AM

-సమ్మె 34వ రోజు వరంగల్ రీజియన్‌లో నడిచిన బస్సులు 716
-అన్నిరూట్లలో నిరాటంకంగా కొనసాగుతున్న సర్వీసులు
-ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్లు
-అధికారుల నిరంతర పర్యవేక్షణ

సుబేదారి, నవంబర్ 07: వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ సేవలు సాఫీగా కొనసాగుతున్నాయి. సమ్మె 34వ రోజు గురువారం వరంగల్ రీజియన్‌లోని తొమ్మిది డిపోల నుంచి బస్సుల రాకపోకలు ప్రశాంతగా కొనసాగాయి. వరంగల్ రీజియన్‌నుంచి 716 సర్వీస్‌లు నడిపినట్లు ఆర్‌ఎం శ్రీధర్ తెలిపారు. మారుమూల గ్రామాలతోపాటు రాష్ట్ర, అంతర్ రాష్ట్ర పట్టణాలుకు పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్, ఏసీ రాజధాని వంటి అన్ని రకాల సర్వీస్‌లను నడిపిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, భూపాలపల్లి, ఏటూరునాగారం, సిద్దిపేట, పాలకుర్తి, నిజామాబాద్, నర్సంపేట రూట్లలో ప్రయాణికుల రద్దీకనుగు ణంగా సర్వీసులను పెంచుతున్నారు. హైదరాబాద్-హన్మకొండ రూట్‌కు పరకాల, భూపాలపల్లి, మహబూబాబాద్, తొర్రూర్ వరంగల్ 1,2, హన్మకొండ, నర్సంపేట డిపోల నుంచి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా విరివిగా ప్రయాణికులకు అందుబాటులో తిరిగాయి. డిపో మేనేజర్లు ప్రతి రోజు రూట్ వారీ షెడ్యూల్‌ను తయారు చేసి, ఆర్డినరి, ఎక్స్‌ప్రెస్, ఏసీ రాజధాని సర్వీస్‌లకు రూట్లు కేటాయిస్తూ, ప్రైవేట్ కండక్టర్లు, డ్రైవర్లకు డ్యూ టీలు వేస్తూ రోజు వారీ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేస్తున్నారు.

ఆపరేషన్స్ విషయంలో అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.
వరంగల్ రీజియన్‌లోని తొమ్మిది డిపోల పరిధిలోమొత్తం 942 బస్సులు ఉన్నాయి. సమ్మె ప్రారంభం నుంచి రోజు వారీగా బస్సుల సంఖ్యను పెంచుతున్నారు అధికారులు.. రీజియన్‌లో మొత్తం 348 రూట్లు ఉండగా, దాదాపు ముఖ్య రూట్లలో బస్సులన్నీ నడుస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించిన అక్టోబర్ 5 నుంచి నేటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీసీ ప్రత్యామ్నాయ సేవలు సాఫీగా కొనసాగుతున్నాయి. ములుగు-ఏటూరునాగారం రూట్‌లో ఇటీవల ఆర్టీసీ అద్దె బస్సు ప్రమాదం మినహా, ఆర్టీసీ సొంత బస్సుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరుగలేదు. ప్రైవేట్ కండక్టర్లు, డ్రైవర్లతో సేవలు అందిస్తున్న నేపథ్యంలో వారి పనితీరును పరిశీలించడానికి ప్రతిరోజు రూట్ వారీగా అధికారులు తనిఖీలు చేస్తునారు. ఎప్పటికప్పుడు డిపో వారీగా డిపోమేనేజర్లు, పోలీసు, ఆర్టీఏ, నోడల్ ఆఫీసర్లు బస్సుల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీధర్, పోలీసు అధికారులు హన్మకొండ బస్‌స్టేషన్‌లో బస్సుల రాకపోకలను పర్యవేక్షించి, రద్దీ ఉన్న రూట్లలో అదనపు బస్సులను నడిపిస్తున్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...