ఉప్పల్ టు తమిళనాడు


Fri,November 8, 2019 03:25 AM

కమలాపూర్: మండలంలోని ఉప్పల్ రైల్వే యార్డు నుంచి తమిళనాడు రాష్ర్టానికి బియ్యం ఎగుమతి చేస్తుంది ప్రభుత్వం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఆధ్వర్యంలో గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం చింతలపల్లి గోదాముల్లో నిల్వ చేసిన బాయిల్డ్ బియ్యం తమిళనాడుకు ఎగుమతి చేస్తున్నారు. చింతలపల్లి గోదాముల నుంచి లారీల్లో ఉప్పల్ రైల్వే యార్డుకు బియ్యాన్ని తరలిస్తుండటంతో కూలీలు రైలు డబ్బాల్లో బియ్యాన్ని లోడ్ చేస్తున్నారు. గోదాముల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలు ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తుండటంతో గోదాములు ఖాళీ అవుతున్నాయి. ఖరీఫ్ పంట చేతికందడంతో ఐకేపీ కొనుగోలు ద్వారా మిల్లులకు తరలించి నూర్పిడి చేసి మళ్లీ గోదాముల్లో నిల్వ చేయనున్నారు. ఖరీఫ్‌లో వరిపంట దిగుబడి పెరగనుండటంతో ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

-2640 మెట్రిక్ టన్నులు
గోదాముల్లో నిల్వ చేసిన బియ్యాన్ని ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసేందుకు లారీల్లో తరలిస్తున్నారు ఎఫ్‌సీఐ అధికారులు. ఉప్పల్ రైల్వే యార్డులో మంగళవారం రైలులో బియ్యం లోడ్ చేస్తున్నారు. సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతలపల్లి గోదాముల నుంచి 130 లారీల్లో బియ్యాన్ని ఉప్పల్ రైల్వే యార్డుకు తరలిస్తున్నారు. 32 బోగీలు ఉన్న రైలులో 2640 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేస్తున్నారు. రైల్వే యార్డు నుంచి బియ్యం ఎగుమతి జరుగుతుండటంతో 270 మంది కూలీలకు ఉపాధి దొరుకుతుంది.

ఒకే రోజు రూ.1800
బియ్యం ఎగుమతి కోసం రైలు రావడంతో లారీల నుంచి రైలులో లోడ్ చేస్తే ఒకే రోజు సుమారు రూ.1800 వస్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలీలు బ్యాచ్‌లుగా ఏర్పడి ఒక్కో రైలు బోగి లోడ్ చేస్తాం. బయట కూలీ పనులు లేకపోవడంతో బియ్యం లోడింగ్‌తో చేతినిండా పనిదొరుకుతుంది. - గుండెకారి రమేశ్, కూలీబయటపనుల్లేవ్
బయట కూలీ పనుల్లేక ఇబ్బంది పడుతున్నాం. బియ్యం లో డింగ్‌తో కూలీ పని దొరుకుతుంది. ఒక బస్తాకు రూ.8 కట్టిస్తున్నారు. ఒకే రోజులో రైలు నింపుతుండటంతో నాల్గు రోజులు బయట చేస్తే వచ్చే కూలీ డబ్బులు ఒక్కరోజులోనే వస్తున్నాయి. బియ్యం లోడింగ్ ఎప్పటికి ఉంటే బాగుండు. - గుండెబోయిన ఐలయ్య కూలీ


85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...