ప్రభుత్వ పాఠశాలల పనితీరును పరిశీలించిన కేంద్ర బృందం


Fri,November 8, 2019 03:24 AM

హసన్‌పర్తి, నవంబర్ 07: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరును కేంద్ర బృందం అధికారులు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. మధ్యా హ్న భోజన పథకం, హాజరుశాతం, విద్యార్థుల ప్రగతి నివేదికపై ఆరా తీశా రు. జెడ్పీఎస్‌ఎస్‌లో విద్యార్థుల మధ్యా హ్న భోజన పథకాన్ని, పాఠశాల ప్రగతి నివేదిక, పాఠశాల రికార్డుల నిర్వహణపై సమీక్షించారు. ఇన్‌చార్జి ఎంఈవో రాంకిషన్‌రాజ్, హసన్‌పర్తి ఎంహెచ్‌ఆర్‌డీ అధికారి కుమారస్వామి పర్యవేక్షణలో ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్ సెక్రటరేట్ సెక్షన్ అధికారులు వినోద్‌కుమార్ తనిఖీల్లో పాల్గొన్నారు. నివేదికను కేంద్రానికి అందజేయనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీ ఎండీ ఆజామ్, సీఆర్‌పీలు ఉమ, గణేశ్, అనిల్‌యాదవ్, భార్గవి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...