నాటుసారా తరలిస్తున్న ముగ్గురిపై కేసు


Fri,November 8, 2019 03:24 AM

-మూడు బైక్‌లు, 30 లీటర్ల గుడుంబా స్వాధీనం
శాయంపేట, నవంబర్ 07 : నాటు సారాను తరలిస్తున్న ముగ్గురిని పట్టుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు ఎక్సైజ్ సీఐ జగన్నాథరావు గురువా రం తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సూర్యనాయక్‌తండా, నిజాంపల్లి దారిలో వరంగల్ రూరల్ డీటీఎఫ్, పరకాల ఎస్‌హెచ్‌వో అధికారులు రూట్ వాచ్ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులు వాహనాలపై సంచులతో అనుమానాస్పదంగా కనిపించగా వారి తనిఖీ చేయగా ఒక్కొక్కరి నుంచి పది లీటర్ల నాటుసారా దొరికిందని తెలిపారు. విచారణలో ముగ్గురు వ్యక్తులు బానోతు రవిందర్, ఆజ్మీర సురేశ్, మాలోతు రాజేశ్వర్‌గా గుర్తించినట్లు తెలిపారు.

వారి వద్ద నుంచి 30 లీటర్ల నాటుసారాతో పాటు మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని పరకాల జెఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. నిషేధిత నాటు సారాను ఎవరైనా తయారు చేసినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. దాడుల్లో డీటీఎఫ్ వరంగల్ రూరల్ సీఐ కరంచంద్, ఎక్సైజ్ ఎస్సై పద్మ, సిబ్బంది ఉన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...