మాదిగ అమరుల ఆశయాలను కొనసాగిస్తాం


Thu,November 7, 2019 01:46 AM

ధర్మసాగర్/ఐనవోలు/ ఎల్కతుర్తి, నవంబర్ 06 : మాదిగ అమరుల ఆశయాలను కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు చిలుక రవీందర్ మాదిగ అన్నారు. వేలేరులో బుధవారం దర్శనాల భారతి 2వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఏ, బీ, సీ డీ వర్గీకరణ అయ్యే వరకు ఉద్యమాన్ని పలు దశల్లో కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బట్టు ధర్మేందర్, అధికార ప్రతినిధి కొయ్యడ శ్రీనివాస్, కనకం రాజయ్య, జిల్లెల పెరుమయ్య, తదితరులు పాల్గొన్నారు. అలాగే ధర్మసాగర్‌లో మేకల రవీందర్, రమేశ్, రాములు, బొడ్డు విశాల్, ముత్తయ్య, కరుణాకర్, వెంకటేశం, ప్రభాకర్, ఏసేబు, ప్రభాకర్, పాల్గొన్నారు. ఐనవోలులో దర్శశాల భారతి మాదిగ వర్ధంతిని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బొక్కల నారాయణ తెలిపారు.

కార్యక్రమంలో బొక్కల వెంకటస్వామి, రమేశ్, ప్రవీణ్, చంద్రమౌళి, ఎల్లయ్య రవీందర్, పరమేశ్, మోహన్ పాల్గొన్నారు. ఎల్కతుర్తిలోఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భారతి మాదిగ వర్థంతిని మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సేవలను ఎమ్మార్పీఎస్ నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రసాద్, రవి, బాబు, సంపత్, అయిలయ్య, శ్రీనివాస్, మొగిళి, కొంరయ్య తదితరులు పాల్గొన్నారు. కమలాపూర్‌లోని అంబేద్కర్ భవనంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించినట్లు ఎంఎస్‌ఎఫ్ జిల్లా కో ఇన్‌చార్జి అంకిల్ల రాజు బుధవారం తెలిపారు. ఎమ్మార్పీఎస్ నాయకులు జగదీశ్, సుధాకర్, ఇస్తారి, ఎంఎస్‌ఎఫ్ నాయకులు అనిల్‌కుమార్, రాహుల్, విద్యార్థులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...