గంటూర్‌పల్లిలో హరితహారం భేష్


Tue,October 22, 2019 03:38 AM

హసన్‌పర్తి, అక్టోబర్ 21: గంటూర్‌పల్లిలో హరితహారం భేష్ అని ఎమ్మెల్యే అరూరి రమేశ్ కితాబిచ్చారు. సోమవారం పెంబర్తి, గంటూర్‌పల్లి సరిహద్దుల్లో రోడ్డుకిరువైపుల హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. మొక్కల సంరక్షణలో పంచాయతీ అధికారులు, సర్పంచ్ తీసుకున్న చొరవను ఆయన అభినందించారు. ప్రతి గ్రామ పంచాయతీ సిబ్బంది గంటూర్‌పల్లిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ పెద్ది తిరుపతమ్మ, ఉపసర్పంచ్ విజేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెంకన్న, ఫీల్డ్ అసిస్టెంట్ కిరణ్‌రెడ్డి, టీఆర్‌స్ నాయకులు రమేశ్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, బుద్దె వెంకన్న, నన్నెబోయిన రమేష్‌యాదవ్, వనంరెడ్డి, శరత్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రసాద్ తదితరులున్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...