ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి


Tue,October 22, 2019 03:38 AM

ధర్మసాగర్, అక్టోబర్ 21 : మండలంలోని జానకిపురం, ముప్పారం గ్రామా ల్లో ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జెడ్పీటీసీ పిట్టల శ్రీలత, దేవునూరు గ్రామానికి చెందిన రైతులు కోరారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యకు సోమవారం హన్మకొండ తన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు. త్వరలో వరి, మొక్కజొన్న పంటలు కోతలు కోయడం జరుగుతున్నందున రైతులకు ఆ ధాన్యం విక్రయించేందుకు అనుకూలంగా కేంద్రాలను అందుబాటులో ఉండాలని కోరినట్లు పేర్కొన్నారు. దేవునూర్‌కు చెందిన రైతులు గ్రామ శివారులో అతిపద్ద బండరాయి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేందుకు అడ్డంగా ఉందని దానిని తొలగించాలని వినతిలో కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎంపీపీ నిమ్మ కవిత, మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు దేవేందర్, గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు యాదగిరి, ఉన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...