సాగి పథకంలో ఎల్కతుర్తి ఎంపిక


Tue,October 22, 2019 03:37 AM

ఎల్కతుర్తి, అక్టోబర్ 21: మండల కేంద్రమైన ఎల్కతుర్తిని కేంద్ర ప్రభుత్వ పథకమైన సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (సాగి) పథకం కింద రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు ఎంపిక చేశారు. ఈ పథకం నాల్గవ విడతలో భాగంగా మండల కేంద్రాన్ని ఎంపీ లక్ష్మీకాంతరావు సిఫారసు మేరకు ఎంపిక జరిగింది. ఈ పథకం ద్వారా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేయనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే సమావేశం నిర్వహించి అభివృద్ధి పనులకు సంబంధించి ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇది వరకు మండలంలోని దండెపల్లిని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సాగి పథకంలో ఎంపిక చేసి అభివృద్ధ్ది చేసిన విషయం తెలిసిందే. ఎల్కతుర్తిని సాగి కింద ఎంపిక చేయడంపై సర్పంచ్ కొమ్మిడి నిరంజన్‌రెడ్డి, ఎంపీటీసీ కడారి రాజు, ఉపసర్పంచ్ వల్లాల శ్వేత, నాయకులు గొల్లె మహేందర్, శేషగిరిలు ఎంపీ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...