శ్మశానవాటికల నిర్మాణాలు పూర్తి చేయాలి


Tue,October 22, 2019 03:37 AM

ఐనవోలు అక్టోబర్ 21 శ్మశాన వాటికల నిర్మాణ పననులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీపీ మార్నేని మధుమతి రవీందర్‌రావు అధికారులను ఆదేశించారు. మండలంలోని ఉడుతగూడెంలో రూ.10 లక్షలతో నిర్మించ తలపెట్టిన శ్మశాన వాటిక నిర్మాణానికి ఆమె జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములుతో కలిసి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో శ్మశాన వాటికలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వాటి నిర్మాణానికి పూనుకుందన్నారు. అనంతరం మండల కేంద్రంలో సర్పంచ్ జన్ను కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈజీఎస్ గ్రామ సభకు ఎంపీపీ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటరమణ, సర్పంచ్ బరిగెల ఆరోగ్యం, ఉప సర్పంచ్‌లు సతీశ్‌కుమార్, కిరణ్, ఎంపీటీసీలు కొత్తూరి కల్పన మధుకర్, అనూష అనిల్, కార్యదర్శి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మిద్దెపాక రవీందర్,యాదవరెడ్డి, మహేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...