ఆటోనగర్ గ్యారేజీ మెకానిక్‌ల


Tue,October 22, 2019 03:36 AM

-సేవలు వినియోగించనున్నాం
అర్బన్ కలెక్టరేట్, అక్టోబర్ 21: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వరంగల్ ఆటోనగర్‌లోని గ్యారేజీల మెకానిక్‌ల సేవలను వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సోమవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జిల్లా కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులు, ట్రాన్స్‌పోర్టు అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాన్యువల్‌గా టికెట్లు జారీ చేసేందుకు అనుమతి ం చాలని కోరగా, మంత్రి అంగీకరించారు. ప్రైవేట్ మెకానిక్‌లకు ఒక్కొక్కరికి రోజుకు రూ.1750 చొప్పున చెల్లించాలని, ఎలక్ట్రీషియన్స్ సేవల ను సైతం తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రవాణాశాఖ ప్రిన్సిపల్ సె క్రటరీ సునీల్‌శర్మ, కమిషనర్ సందీప్ సుల్తానియా, ఆర్‌ఎం శ్రీధర్, ఆర్డీవో వెంకారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ వైవీ గణేశ్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పురుషోత్తం, ఏ ఎంఏ రవీందర్, మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ వేణు తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...