ప్రజల కోసం పోలీసుల ప్రాణత్యాగం


Mon,October 21, 2019 05:09 AM

-శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
-నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం
వరంగల్ క్రైం, అక్టోబర్20 : శాంతిభద్రతల కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల స్మరించుకునేందుకు ప్రతి యేటా పోలీస్ శా ఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 21న అమరవీరుల సం స్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఉమ్మడి జి ల్లాలో శాంతిభద్రతల కోసం 64 మంది ప్రాణత్యా గం చేయగా వారి స్మారకార్థం కమిషనరేట్ కార్యాలయంలో అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు. సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్‌హౌస్, రక్తదాన శిబిరాలు, విద్యార్థ్ధులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. ఈ మేరకు కమిషనరేట్ కార్యాల యంలోని అమరవీరుల స్తూపాన్ని సుందరంగా అలంకరించారు. సీపీ రవీందర్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం అమరులకు నివాళులర్పించి స్మృతి పరేడ్ చేయడంతో సంస్మరణ వారోత్సవాలు ముగుస్తాయి. అమరుల కుటుంబసభ్యు లు అంతా స్మృతి వనానికి చేరుకొని అమరవీరులను యాది చేసుకుని నివాళులర్పించనున్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...